రోహిణి చదువులో ఎంతో గ్రేట్... తలెత్తుకునేలా చేసింది
on Apr 3, 2025
కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కాలేజీ స్పెషల్ పేరుతో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఇక ఈ షోకి ఒక స్పెషల్ గెస్ట్ గా ఒక ప్రొఫెసర్ వచ్చారు. రావడంతో లేడీ కమెడియన్ రౌడీ రోహిణి లేచి నిలబడింది. ఆయన ఎవరో కాదు రోహిణికి చదువు చెప్పిన ప్రొఫెసర్ అన్న విషయం అర్థమైపోతుంది. ఆయనకు రోహిణి వినమ్రంగా రెండు చేతులు జోడించి నమస్కరించింది. ఆయన రాగానే "షీ కంప్లీటెడ్ డిప్లొయ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్.. ఒక స్టూడెంట్ గా చూసాను. ఇప్పుడు ఈ స్టేజి మీద చూడడం నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్" అంటూ తన స్టూడెంట్ గురించి ఆ ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు.
ఇక ఆయన మాటలు విన్న వాళ్లంతా వ్వావ్ అంటూ చప్పట్లు కొట్టి రోహిణి టాలెంట్ ని మెచ్చుకున్నారు. రౌడీ రోహిణి చిన్న చిన్నగా ఎదుగుతూ ఇంత దూరం వచ్చింది. బుల్లితెర లేడీ కమెడియన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఫస్ట్ ప్లేస్ లో రోహిణి ఉంటుంది. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళింది అలాగే మూవీస్ లో నటిస్తోంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో ఐతే రోహిణి నటన చూస్తే పొట్ట చెక్కలయ్యేంత కామెడీ ఉంటుంది. ఆమె టైమింగ్ కామెడీతోనే ఎన్నో అవకాశాలను అందుకుంటోంది. రాకింగ్ రాకేష్ స్కిట్స్ లో చేసి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే బంగార్రాజు మూవీలో హీరోయిన్ కృతి శెట్టి వెంట ఉండే రోల్ లో నటించింది రోహిణి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
